సంక్రాంతి సంబరాలు 2k17
Sankranthi Celebrations 2K17 # Takkellapadu Official
ముగ్గులు
రాళ్ళూ రప్పలూలేకుండా ఒకపద్ధతిలో అలకబడిననేల, మేఘాలులేని ఆకాశానికిసంకేతం. ఒకపద్ధతిలో పెట్టబడుచుక్కలు రాత్రివేళ కనిపించేనక్షత్రాలకు సంకేతం.
చుక్కలచుట్టూ తిరుగుతూచుక్కలను గళ్ళలోఇమిడ్చే ముగ్గుఖగోళంలో ఎప్పడికప్పుడుకనిపించే మార్పులకుసంకేతం. ఎంతపెద్దదైనా చిన్నదైనాముగ్గు మధ్యగడిలో పెట్టేచుక్క సూర్యుస్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలోగీతలు స్థితశక్తికి(స్టాటిక్ ఫోర్స్),చుక్కలుగతిశక్తి (డైనమిక్ఫోర్స్)కుసంకేతాలని, మరియుముగ్గులు శ్రీచక్ర సమర్పనాప్రతీకలని శక్తితత్త్వవేత్తలు అంటారు. ఇక వివిధఆకారాలతో వేయుముగ్గులు విల్లుఆకారం పునర్వసునక్షత్రానికీ, పుష్పంపుష్యమీ నక్షత్రానికీపాము ఆకారముఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివిమేష, వృషభ, మిధున, కర్కాటకరాసులకూ, తొమ్మిదిగడుల ముగ్గునవగ్రహాలుకూ సంకేతాలుగాచెప్పచ్చు.

రధం ముగ్గు
పశ్చిమగోదావరి జిల్లాలో రథం ముగ్గు
గుంటూరులో సంక్రాంతిని గుర్తుతెచ్చే ముగ్గు
మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.
గొబ్బెమ్మలు
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపుకుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.
Post Comment
No comments